Tuesday, 3 November 2026

ఐదిళ్లలో దొంగల బీభత్సం

నిజామాబాద్‌,  : నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం రెంజర్లలో తాళం వేసి ఉన్న ఐదిళ్లలో దొంగలు పడ్డారు. కిషోర్‌ ఇంట్లో 60వేల రూపాయల నగదు, మూడు తులాల బంగారం ఎత్తుకెళ్లారు. మరో మూడు రోజుల్లో గల్ఫ్‌కు వెళ్లనున్న కిషోర్‌ ఇంట్లో దొంగలు పడటంతో ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు. రాంరెడ్డి, గోపి, తదితరుల ఇళ్లలో దొంగలు పడ్డారు. గోపి ఇంటి ముందు పార్కింగ్‌ చేసి ఉన్న బైక్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసులు వచ్చి దొంగల కోసం గాలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *