హైదరాబాద్: ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌ను సస్పెండ్ చేయడం బాధాకరమని, ఈ చర్యతో భారత పరువు మంటగలిసిందని రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి మల్లారెడ్డి అన్నారు. ప్రభుత్వం బాధ్యత తీసుకుని సమస్యను పరిష్కరించాలన్నారు. ఇప్పుడిప్పుడే భారత క్రీడాకారులు సమస్యలను పరిష్కరించాలన్నారు. ఇప్పుడిప్పుడే భారత క్రీడాకారులు సమస్యలను అధిగమించి ముందుకెళ్తుండగా ఇలాంటి పరిణామం చోటుచేసుకోవడం శోచనీయమని ఆయన వ్యాఖ్యానించారు. క్రీడాకారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వెంటనే సస్పెన్షన్ ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.




