Wednesday, 4 November 2026

సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించిన ఘనత కాంగ్రెస్‌దే :మంత్రి గీతారెడ్డి

హైదరాబాద్‌: అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్‌ లక్ష్యంగా ఏకాకిని చేసినా శాసనసభలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించిన ఘనత తమ పార్టీకి దక్కిందని భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి అన్నారు. అంబేద్కర్‌ ఆలోచనావిధానం, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అంశంపై యువజన కాంగ్రెస్‌ హైదరాబాదులో నిర్వహించిన సదస్సులో గీతారెడ్డితో పాటు మంత్రి శైలజానాథ్‌ పాల్గొన్నారు. సమాజంలో అట్టడుగు వర్గాల జీవితాల్లో మార్పు తెచ్చే చారిత్రాత్మక ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టం ద్వారా మాదిగ, గిరిజన, ఉపకులాలకు సంపూర్ణ న్యాయం చేస్తామని గీతారెడ్డి హామీ ఇచ్చారు. హరిజనోద్దరణ కార్యక్రమం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ దళితులను అక్కున చేర్చుకుందని మంత్రి శైలజానాథ్‌ పేర్కొన్నారు. ఆర్ధిక స్వాతంత్య్రం ద్వారానే సామాజిక అసమానతలు తొలుగుతాయన్నారు. సబ్‌ప్లాన్‌ సమత్ర అమలు, విశిష్గతను ప్రజలో చైతన్యం తెచ్చే బాధ్యత యువజన కాంగ్రెస్‌పై ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *