ఐసిడిఎస్ అంగన్వాడి గ్రేడ్ సూపర్వైజర్ గా సంతోష నియామకం

.తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఐసిడిఎస్ అంగన్వాడి గ్రేడ్ 2 సూపర్వైజర్ నియామకం చేపట్టగా కౌడిపల్లి గ్రామ (4)వ అంగన్వాడి కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడి టీచర్ ఆదెల్లి సంతోష, గ్రేడ్ 2 సూపర్వైజర్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించి ఎంపిక అయింది. దీంతో కౌడిపల్లి స్వగ్రామానికి ఎమ్మెల్యే వచ్చిన సందర్భంగా ఐ సి డి ఎస్ గ్రేడ్ 2 సూపర్వైజర్ గా ఎంపికైన సంతోషను శాలువాతో ఘనంగా సన్మానించారు. కౌడిపల్లి లోఅంగన్వాడి కేంద్రం అభివృద్ధికి పాటుపడడంతోపాటు పలు కార్యక్రమాలు నిర్వహించి మన్ననాలు పొందిందని అభినందించారు.ఈ కార్యక్రమంలో కౌడిపల్లి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి,  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పి కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, నర్సాపూర్ ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి, కౌడిపల్లి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సారా రామ గౌడ్, యూత్ అధ్యక్షుడు చంద్రం కృష్ణ గౌడ్, మండల కో ఆప్షన్ సభ్యుడు మహమ్మద్, నాయకులు రాజిరెడ్డి, నాయికోటి శ్యాంసుందర్ రాజు, లింగం, సంతోష్ రావు తదితరులు పాల్గొన్నారు.