Thursday, 5 November 2026

ఐసిడిఎస్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు

ఐసిడిఎస్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు

బోనకల్ , జనవరి 10 (జనం సాక్షి): మధిర ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని బోనకల్ సెక్టార్ లోని అంగన్వాడీ టీచర్లకు ఐ ఎల్ ఏ శిక్షణలో భాగంగా శిక్షణ కార్యక్రమాలు మంగళవారం రావినూతల రైతు వేదిక నందు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీడీపీఓ వీరభద్రమ్మ పలు (13,14)మాడ్యూల్స్ గురించి వివరించారు. బలహీనంగా ఉన్న పిల్లలకు పోషకాహారాన్ని బిడ్డ ఆరోగ్యం వేగంగా క్షమిస్తుందంటే వారిలో పోషక లోపాలు ఉన్నట్లు గృహ సందర్శన కార్యక్రమం ద్వారా పల్లెలకు పోషక ఆహారం గురించి వివరించాలన్నారు. అంగన్వాడి కేంద్రాలలో అందించే సేవలు అన్ని ఆన్లైన్లో పారదర్శకంగా నమోదు చేయాలని చెప్పడం జరిగింది. రోజువారి పిల్లల హజరు,రోజువారీ ప్రీ స్కూల్ కార్యక్రమాలు,పెరుగుదల పర్యవేక్షణ నమోదు,సరుకుల నిల్వల వివరాలు,పోషణ ట్రాకర్, లబ్ధిదారుల వివరాలు, నెలవారి
రిపోర్ట్లులు వంటి సమాచారం ఆన్లైన్ ఆధారంగా పొందుపరచడం జరుగుతుంది. ప్రతీ అంగన్వాడి టీచర్ వివరములు అన్నీ సమ యనుసారంగా కచ్చితత్వమ్ ఉండేలా నమోదు
చేయవలసిఉంటుంది అన్నారు.ఈ కార్యక్రమంలో ఏసిడిపిఓ వీరభద్రమ్మ, సూపర్వైజర్ రమాదేవి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.