జోరందుకున్నా ఎడ్ల బండి పందెలు,
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: చింతలమానేపల్లి మండలం:10 జనవరి (జనం సాక్షి): బాలాజీ అనుకోడ గ్రామంలో మంగళవారం నిర్వహించిన ఎడ్ల బండ్లతో పరుగు పందాలకు అనూహ్య స్పందన లభించింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులను కొనియాడారు. ఎడ్ల పరుగు పందెంలో మొత్తం 22 జతలు పాల్గొనగా, దహెగాం మండలం ఐనం గ్రామానికి చెందిన బోయిరే తులసిరాంకు మొదటి స్థానం, ఇట్యాల గ్రామానికి చెందిన భగవత్ కు రెండవ స్థానం లభించగా వారికి 5 గ్రాములు, 2.5 గ్రాముల బంగారం బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీలు డుబ్బుల నానయ్య, విశ్వనాథ్, జడ్పీటీసీ డుబ్బుల శ్రీదేవి, సర్పంచ్ రౌతు సుజాత, ఉప సర్పంచ్ బాగ్య, ఎస్సెలు వెంకటేష్, మనోహర్, ఏఎస్సె యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాగా నియోజకవర్గం స్థాయిలో పోటీలు నిర్వహించగా ఆయా గ్రామాల నుండి ఎడ్ల పరుగును చూసేందుకు జనం భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో అక్కడ సందడిగా మారింది.




