ఐసిన్‌కు  నిధులు సమకూరుస్తున్న డాక్టర్‌ అరెస్ట్‌

ముంబై,మార్చి5(జ‌నంసాక్షి):  ఐసిస్‌ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న వ్యక్తులకు నిధులు సమకూరు స్తున్నట్లుగా భావిస్తున్న ఓ డాక్టర్‌ను మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనవరిలో రిపబ్లిక్‌ డే వేడుకల సమయంలో యాంటీ టెర్రరిస్ట్‌ స్కాడ్‌ బృందం ఐసిస్‌తో సంబంధమున్న మైనర్‌ సహా తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ఐసిస్‌కు నిధుల సేకరణలో సహాయం చేస్తున్న ఔరంగాబాద్‌కు చెందిన డాక్టర్‌ను అరెస్ట్‌ చేశామని పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. డాక్టర్‌ను విచారణ చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని వెల్లడించారు.