ఐసీసీ అధ్యక్షుడు ముస్తాఫా కమల్ రాజీనామా

న్యూఢిల్లీ: ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) అధ్యక్షుడు ముస్తాఫా కమల్ ఇవాళ రాజీనామా చేశారు. ప్రపంచకప్-2015లో మార్చి 19న క్వార్టర్ ఫైనల్ లో భాగంగా భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అంపైర్ల తప్పిదాలున్నాయని ముస్తాఫా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.