పల్లి మే 24(జనంసాక్షి ):పి.ఏ.పల్లి మండలంలో వివిధ ఐకెపి సెంటర్లలో ధాన్యం కొనుగోలు విషయంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని బిజెపి జిల్లా నాయకులు పొతెం కరుణాకర్ అన్నారు ఆయన రైతులతో మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని వెంటనే రైతుల ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని ఆరుగాలం పండించిన పంట అకాల వర్షాలతో రైతులు నష్ట పోకుండా చూడాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా మాజీ కార్యదర్శి ఎర్ర వెంకటేశ్వర్లు బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు కలగొని సైదులు గౌడ్ బిజెపి మండల ప్రధాన కార్యదర్శి వరికుప్పల శ్రీరాములు బిజెపి మండల ఉపాధ్యక్షులు వద్దిరెడ్డి మల్లారెడ్డి తక్కెళ్ల లక్ష్మణ్ నెలపట్ల శ్రీను గుండాల అంజి లింగుస్వామి రాజు చంటి రైతులు తదితరులు పాల్గొన్నారు
ఐ కె పి సెంటర్లను సందర్శించిన బిజెపి నాయకులు పెద్ద అడిషర్ల




