బెల్లంపల్లి, మే 24, (జనంసాక్షి )
బెల్లంపల్లి మండలం మాల గురిజాల గ్రామంలో ఎస్సి కార్పొరేషన్ పథకం కింద లబ్ధిదారులకు మంజూరైన బోర్ వెల్ పనులను బుధవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులు ఎస్సి కార్పొరేషన్ పథకం ద్వారా ఆర్థికాభివృద్ధి సాదించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం దళిత, గిరిజనుల అభ్యున్నతికై ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, వాటి ద్వారా అభివృద్ధి సాదించాలన్నారు. ఈకార్యక్రమంలో సర్పంచులు అశోక్, రాయమల్లు, ఎంపీటీసీ కలాలి శకుంతల – వెంకటేష్, వార్డు సభ్యుడు మణిదీప్, కో అప్షన్ సభ్యుడు రామయ్య, నాయకులు గణేష్ గౌడ్, భీమయ్య, తిరుపతి, శ్రీకాంత్, వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బోర్ వెల్ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే.




