Thursday, 5 November 2026

ఒకరి అవయవాలు.. నలుగురికి !

 హైదరాబాద్ : ఓ కారు డ్రైవర్ తాను చనిపోయినా ఇద్దరికి ప్రాణదానం చేస్తున్నాడు. మరో ఇద్దరికి చూపుని ప్రసాదిస్తున్నాడు. ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన మణికంఠ అవయవాలను దానం చేసేందుకు ఆయన కుటుంబ సభ్యులు అంగీకరించడంతో ఇది సాధ్యం అవుతోంది. ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న ఎన్నారై ఆస్పత్రి నుంచి మణికంఠ అవయవాలు అమర్చేందుకు వివిధ ప్రదేశాలకు తరలిస్తున్నారు. అవయవాలను తరలించేందుకు ఆస్పత్రి నుంచి కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్ పోర్టు వరకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. మణికంఠ గుండె, ఊపిరితిత్తులు చెన్నైలోని పోర్టిస్ ఆస్పత్రిలో ఓ పేషెంట్ కు అమర్చేందుకు ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్ లో తరలించారు. ఆయన కాలేయాన్ని హైదరాబాద్ లోని గ్లోబల్ ఆస్పత్రిలో మరో పేషెంట్ కు అమరుస్తారు. మణికంఠ కళ్లు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మరో ఇద్దరికి అమరుస్తారు. మణికంఠ కుటుంబం విశాల హృదయానికి స్థానికులు హ్యాట్సాఫ్ చెప్పారు. మణికంఠకు నివాళిగా రామవరప్పాడు నుంచి నిడమనూరు వరకు మానవహారం ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *