Wednesday, 4 November 2026

ఒకేప్రాంతం అని రైలులో దోంగ‌త‌నం చేసిన వ్య‌క్తి ఆరెస్టు

న‌ల్గొండ జిల్లా నకిరేకల్ మండలం వల్లభాపురం గ్రామానికి చెందిన సందీప్ తల్లిదండ్రులు గత కొన్నేళ్లుగా గుజరాత్‌లో ఉంటున్నారు. తల్లిదండ్రుల వద్దకు వెళ్లిన సందీప్ తిరిగి స్వస్థలానికి చేరుకోవడానికి అహ్మదాబాద్ నుంచి నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణమయ్యాడు. ప్రయాణంలో పరిచయమయిన బంటు సైదులు తనది నల్గొండ జిల్లా సుర్యాపేట అని  సరదాగా మాట్లాడాడు. దీంతో అతన్ని నమ్మిన సందీప్ అతనితో మాట కలిపాడు. గుజరాత్ నుంచి సందీప్ డబ్బు తీసుకొని వస్తున్నాడని గమనించిన బంటు సైదులు ఎలాగైనా దాన్ని కొట్టేయాలని పథకం వేశాడు. సోమవారం ఉదయం ట్రైన్ వరంగల్ చేరుకున్న సమయంలో సందీప్ బాత్‌రూంకు వెళ్లిన సమయం చూసి చాకచక్యంగా అతని బ్యాగ్‌లో ఉన్న లక్ష రూపాయలు తన బ్యాగ్‌లోకి మార్చాడు. డబ్బు పోయిందని గమనించిన సందీప్ లబోదిబోమంటుంటే ఇదంతా గమనించిన పక్క సీటు వ్యక్తి బంటు సైదులు నిజ స్వరూపాన్ని బయటపెట్టడంతో అసలు విషయం తెలిసింది. దీంతో అప్రమత్తమైన రైల్వే గార్డులు బంటు సైదులును వరంగల్ పోలీసులకు అప్పగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *