Wednesday, 4 November 2026

నెక్లెస్‌రోడ్లో గ్రీన్‌ రన్‌ను ప్రారంభించిన ఎంపి కవిత

హైదరాబాద్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి ):హైదరాబాద్‌ నగరంలో 100 జంక్షన్లు ఏర్పాటు చేసి మొక్కలు నాటనున్నట్టు ఎంపీ కవిత తెలిపారు. నెక్లెస్‌  రోడ్డులో ప్‌లానెట్‌ 3 ప్రొటెక్షన్‌ అలయన్స్‌ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన గ్రీన్‌ రన్‌ను ఆమె ప్రారంభించారు. హైదరాబాద్‌ను హరితనగరంగా తీర్చిదిద్దేంకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. స్వచ్ఛందసంస్థ చేపట్టిన గ్రీన్‌రన్‌ను ఆదర్శంగా తీసుకుని విస్తృతంగా మొక్కలు నాటాలని కవిత సూచించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణంపై అవగాహన పెంచుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *