Wednesday, 4 November 2026

ఒకే చోట ఒకే దగ్గర యాగాలు చేయడం చరిత్రలో లేదు. ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి-ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.

 

 

 

 

 

తాండూరు జులై 7(జనంసాక్షి)ఒకే చోట ఒకే దగ్గర యాగాలు చేయడం చరిత్రలో లేదని
ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం తాండూర్ పట్టణంలోని ఆయన నివాసంలో మీడియా సమావేశాన్ని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నిర్వహించారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు జరిగే శ్రీ రాజ శ్యామల, చండీ, సౌర, లక్ష్మి సుదర్శన, సహిత అతిరుద్ర మహాయాగం లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. తాండూర్ ప్రజలు సుభిక్షంగా ఉండాలని అలాగే రాష్ట్ర దేశ ప్రజలు కూడా సుఖశాంతాలతో ఉండాలని నిర్వహించే ఇలాంటి యాగాలలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని అన్నారు. పిల్లల మంచి భవిష్యత్తుకు నిరుద్యోగులకు ఉద్యోగాలు అలాగే ప్రతి ఒక్కరు ఉన్నత శిఖరాల కోసం నిర్వహించే మహా సంకల్ప యాగాలకు ప్రతి ఒక్కరు పాల్గొని అన్నారు .ముఖ్యమంత్రి కేసిఆర్ ఆరోగ్యం మరో మారు తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం రావాలని రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెట్టింపు ఉత్సాహంతో అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. 13 రోజులపాటు నిర్వహించే యాగాలలో 11 వేల మంది పుణ్య దంపతులతో యాగాలు చేయడం జరుగుతుందని రానున్న తొమ్మిది రోజుల్లో 20 నుంచి 30 వేల మంది దంపతులు వచ్చినా కూడా అన్ని ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇలా ఒకే చోట ఒకే దగ్గర కొన్ని యాగాలు చేయడం చరిత్రలో లేదని అన్నారు ఇలాంటి యాగంలో పాల్గొని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు మరోవైపు రెండు మూడు రోజుల్లో రాష్ట్ర మంత్రులతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు కూడా యాగాలలో పాల్గొంటారని అన్నారు. ఇలాంటి యాగం నిర్వహించడం చరిత్రలోనే మొట్టమొదటిసారి తాండూర్ కు దక్కడం అలాగే తాండూర్ ప్రజలు నన్ను ఆశీర్వదించడం పై ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.