తాండూరు జులై 7(జనంసాక్షి)శ్రీ రాజశ్యామల శత చండీ, సౌర, లక్ష్మీ సుదర్శన సహిత అతిరుద్ర మహయాగం సందర్భంగా గురువారం ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ని మరియు వారి సతీమణి అయిన ఆర్తి ని బ్రాహ్మణ సమాజం సన్మానించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సమాజం సభ్యులు మాట్లాడుతూ కనివిని ఎరుగని రీతిలో అతిరద్ర మహా యాగం చేయడం చరిత్ర సృష్టించిందని తెలిపారు.
అన్ని కార్యక్రమాల్లో విజయం సాధించాలని వేదమంత్రాలతో ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వారిని సన్మానించి అమ్మవారి జ్ఞాపికలను అందజేసారు.




