హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన ఒబామాకు ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. ఒబామా నాయకత్వంలో అమెరికా అన్ని రంగాల్లోను ముందుకెళ్తుందని కిరణ్ ఆకాంక్షించారు. అమెరికాలో నివసిస్తున్న తెలుగు సంఘాల సంక్షేమానికి ఒబామా ప్రభుత్వం కృషి చేస్తుందనే అశాభావాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు.




