Tuesday, 3 November 2026

ఒబామా ఓ అజ్ఞాని, క్లింటన్ ఓ రేపిస్ట్

త్వరలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నేతల మధ్య విమర్శలు పెచ్చుమీరుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ఒబామాను రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్ టార్గెట్ చేశారు. పలుమార్లు ట్రంప్‌ పై ఒబామా విమర్శలు చేయటంతో ఆయన కౌంటర్‌ ఆటాక్‌ ఇచ్చారు. ఒబామా ఒక అజ్ఞాని, అవివేకి, అసమర్ధుడు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఒబామా పరిపాలన కాలంలో అమెరికా ప్రపంచంలో మూడో స్థాయికి దిగజారిందన్నారు. చైనా ముందు అమెరికా అభివృద్ధి చెందిన దేశంగా మారిన పరిస్థితి వచ్చిందని ఫైరయ్యారు. ఇక డెమెక్రాటిక్‌ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్‌ భర్త బిల్‌ క్లింటన్‌ పైన ట్రంప్ ఫైర్‌ అయ్యారు. బిల్ క్లింటన్ రేపిస్ట్ అని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *