Tuesday, 3 November 2026

ఈ నెల 23న జయ ప్రమాణస్వీకారం

తమిళనాడులో చారిత్రాత్మకంగా విజయం సాధించిన అన్నాడీఎంకే ఫుల్ ఖుషీలో ఉంది. సీఎంగా జయలలిత రెండోసారి ఈ నెల 23 న ప్రమాణం చేయాలని డిసైడయ్యారు. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలోని సభ్యులకే కేబినెట్ లో అవకాశం కల్పించనున్నారు. ఇప్పుడున్న కేబినెట్‌ లో నలుగురు మంత్రులు ఓటమి పాలయ్యారు. వీరి స్థానంలో జయలలిత కొత్త వారికి అవకాశం కల్పించనున్నారు. ఇవాళ లేదా శనివారం పార్టీ శాసనపక్షం సమావేశమైన జయను శాసనసభ పక్షనేతగా ఎన్నుకోనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *