Thursday, 5 November 2026

ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్లో డిసెంబర్ 26వ తేదీ నుంచి 30 జరుగుతున్న

ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్లో డిసెంబర్ 26వ తేదీ నుంచి 30 జరుగుతున్న జాతీయస్థాయి బ్యాడ్మింటన్ సబ్ జూనియర్స్ పోటీలలో మన రాష్ట్ర క్రీడాకారులు సత్తా చాటుతున్నారని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు బెల్లంపల్లి ఏసిపి ఎడ్ల మహేష్తెలిపారు, గత మూడు నుంచి జరిగిన మ్యాచ్లలో సత్తా చాటి క్వార్టర్ ఫైనల్స్ కు దూసుకు వెళ్లారు, ఈ సందర్భంగా కోచ్లు నీల్ కమల్,అన్వేష్,మేనేజర్లు పుల్లూరి సుధాకర్, సత్యపాల్ రెడ్డి లను అధ్యక్షుడు ఎడ్ల మహేష్ ప్రత్యేకంగా అభినందించారు, క్వార్టర్ ఫైనల్ చేరుకున్న రాష్ట్ర క్రీడాకారుల మేనేజర్ తెలిపారు, బాలికల సింగిల్స్ విభాగంలో అండర్ 15 లో
తన్వి రెడ్డి, దీక్షిక, అండర్ 15 బాలుర విభాగంలో టీటీ జ్ఞాన దత్తు, అండర్ 15 మిక్స్డ్ డబుల్ విభాగంలో కీర్తి, అమర్జీత్, మరియు స్కైదీప్ కౌర్, శౌర్య కిరణ్,
బాలుర విభాగంలో అండర్ 17 లో సింగిల్స్ లో ఏ ఆర్ రోహన్ కుమార్, నుమేర్ షేక్, బాలుర డబుల్ విభాగంలో నుమేర్ రోహన్, బాలికల సింగిల్స్ విభాగంలో బోనం ప్రశంస లు డిసెంబర్ 29వ తేదీన జరగనున్న క్వాటర్ ఫైనల్స్ పోటీలలో పాల్గొంటారని తెలిపారు.