Thursday, 5 November 2026

హెడ్ కానిస్టేబుల్ శివకుమార్ మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన జిల్లా ఎస్పీ అపూర్వరావు

హెడ్ కానిస్టేబుల్ శివకుమార్ మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన జిల్లా ఎస్పీ అపూర్వరావు

పోలీస్ లాంచనాలతో హెడ్ కానిస్టేబుల్ అంత్యక్రియలు

 

గోపాల్ పేట్ జనం సాక్షి డిసెంబర్ (28): మండల పరిధిలోని బుద్ధారం గ్రామానికి చెందిన శివకుమార్ 45 సంవత్సరాలు పోలీస్ శాఖలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు మంగళవారం రాత్రి బుద్ధారం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన విషయం తెలుసుకున్న వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వరావు బుద్ధారం గ్రామానికి చేరుకొని శివకుమార్ మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం శివకుమార్ అంత్యక్రియలు బుద్ధారం గ్రామంలో పోలీస్ లాంచనాలతో గాల్లోకి మూడు రౌండ్ ఫైరింగ్ చేసి అంతిమ సంస్కారాలు నిర్వహించడం జరిగింది