హైదరాబాద్,నవంబర్6(జనంసాక్షి): ఎన్నికల నేపథ్యంలో వాణిజ్యపన్నుల శాఖ ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పార్టీలు, అభ్యర్థులు ప్రయత్నిస్తే వారిపై ఫిర్యాదు చేసేందుకు వాణిజ్య పన్నుల శాఖ టోల్‌ఫ్రీ నంబర్ 18004253787ను ఏర్పాటు చేసింది. నగదు, బహుమతులతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిన వారిపై, పన్నులు చెల్లించకుండా వస్తువులను తరలించినా టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. వాణిజ్య పన్నుల శాఖ సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటు రివార్డు ఇవ్వనుంది.ఈ మూరకు అధికారులుప్రకటన విడుదల చేశారు.




