జనం సాక్షి :కొల్లాపూర్ నియోజక వర్గం ఫిబ్రవరి 13నాగర్ కర్నూలు జిల్లాలోని తెలకపల్లి మండలంలోని కేజీబీవీ గురుకుల పాఠశాలలో కస్తూర్బా పాఠశాలలు కారణంగా ఉన్నత పాఠశాల గౌరెల్లి పల్లి ఉన్నత పాఠశాలల్లో ప్రచారం చేస్తూ ఎస్టియుటిఎస్ బలపరిచిన ఉమ్మడి ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల మేధావులకు మాత్రమే ఉన్న ఎమ్మెల్సీ అవకాశాన్ని కాపాడుకుందాం, ప్రశ్నించే గొంతును గెలిపించుకుందాం. ఉపాధ్యాయ అధ్యాపక మేధావులకు మాత్రమే గొప్ప అరుదైన అవకాశం శాసనమండలిలో ఎమ్మెల్సీగా ఉండాలని కోరిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, రాజ్యాంగ పరిషత్తు కలలుగన్న విధంగా శాసనమండలిలో మేధావుల గొంతు ప్రతిధ్వనించాల్సిన అవసరం ఉంది. కానీ దీనికి భిన్నంగా నేడు ఉపాధ్యాయ అధ్యాపక మేధావి ఓటర్లతో గెలిచిన ఎమ్మెల్సీలు ప్రభుత్వ భజనపరులుగా ధనార్జనే ద్యేయంగా మారిపోతూ విద్యారంగ సమస్యలను విస్మరిస్తూ, ఉపాధ్యాయ అధ్యాపకుల ఆత్మగౌరవానికి భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తున్న తీరు బాధాకరమని,నాగర్ కర్నూలు జిల్లాలోని తెలకపల్లి మండలంలోని కేజీబీవీ గురుకుల పాఠశాలలో కస్తూర్బా పాఠశాలలు కారణంగా ఉన్నత పాఠశాల గౌరెల్లి పల్లి ఉన్నత పాఠశాలల్లో ప్రచారం చేస్తూ ఎస్టియుటిఎస్ బలపరిచిన ఉమ్మడి ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఎమ్మెల్సీ అభ్యర్థిశ్రీ బి భుజంగరావు నికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును వేసి మేధావుల గొప్ప తనాన్ని చాటాలని ఎస్టీయూ తెలంగాణ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పర్వత్ రెడ్డి మాట్లాడారు.ఈ సారి శాసనమండలిలో మార్పు చేసి ఉపాధ్యాయ అధ్యాపక సత్త చాటాలన్నారు. ఓటర్లు తమ ఓటును వజ్రాయుధంగా మలుచుకోవాలని ఎన్నికల బరిలో ఆ ఓటు అనే వజ్రాయుధాన్ని తమ అమ్ములపొదిలో భద్రపరుచుకోవాలని అలాంటి బాణాన్ని ఎక్కుపెట్టి వదిలితే ప్రశ్నించే గొంతుగా పుట్టుకు రావాలని, శాసనమండలిలో ఆ గొంతు ప్రతిధ్వనించే విధంగా గెలిపించి తీరాలని అభ్యర్థించారు.ఉపాధ్యాయ, అధ్యాపకుల అన్ని సమస్యల పరిష్కారానికి సంఘం అండగా ఉంటదని అన్నారు. విద్యారంగంలో అనుకోని రీతిన 317 జీవో బాధితులుగా ఉన్న ఉపాధ్యాయుల బాధలు వర్ణనాతీతమన్నారు. ఐదు సంవత్సరాలకు ఒకసారి తమకు వచ్చే పిఆర్సి సహితం అభాసుపాలయిందని, అవమానకరమైన రీతిలో 33 నెలల ఏరియర్స్ చేతికి రాకుండా ప్రశ్నార్ధకమైనాయని మరో నూతన పిఆర్సి 01.07.2023 నుండి రావలసిన దానిని మాటే మరువడం శోచనీయమని నేటికీ కమిటీ వేయకపోవడం విచారకరమని వెంటనే పి ఆర్ సి కమిటీ వేసి త్వరలో పిఆర్సి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏడున్నర సంవత్సరాలుగా ఉపాధ్యాయ పదోన్నతులు, నాలుగు సంవత్సరాలుగా బదిలీలు గందరగోళంగా తయారై ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మరోసారి ఉపాధ్యాయులను మభ్యపెడుతూ మాయ మాటలు చెబుతూ కొందరు తమ స్వార్థానికి వాడుకుంటున్నారే తప్ప ఉపాధ్యాయుల ప్రయోజనాలకు ఆలోచించకపోవడం బాధాకరమన్నారు. గ్రేడ్2 పండితుల,పిఈటీల పదోన్నతులకు న్యాయపరమైన చిక్కులను తొలగించి వెంటనే పదోన్నతులు సాకారం అయ్యే విధంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ఎస్ జి టి టీచర్లకు సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా అన్ని ప్రైమరీ స్కూళ్లకు హెచ్ఎం పోస్టుల్లో అనౌన్స్ చేసిన విధంగా వారందరికీ కూడా పదోన్నతి లభించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. సకల సమస్యలతో సతమతమవుతున్న విద్యారంగానికి ప్రశ్నించే గొంతుగా ఎమ్మెల్సీ శాసనమండలిలో చిత్తశుద్ధితో తోడైతే పరిష్కారం లభించే అవకాశం 100% ఉంటుందని అన్నారు. అందుకే మేధావుల తీర్పు విలక్షణంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మామిళ్ళ సుదర్శన్ , జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ మురళి మండల అధ్యక్షులు సి విశ్వేశ్వర్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి శ్రీను జిల్లా నాయకులు నందకిషోర్ మరియు ప్రభాకర్ శంకర్ రఘురాం రెడ్డి లక్ష్మీనరసింహారెడ్డి జహంగీర్ భాష తదితరులు పాల్గొన్నారు.




