– మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి హుజూర్ నగర్ ఫిబ్రవరి 13 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని హుజూర్ నగర్ మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి కోరారు. స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ పరిధిలోని గోవిందపురం ఎనిమిదవ వార్డు నందు కౌన్సిలర్ సౌజన్యధనుంజయ ఆధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజూర్ నగర్ మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరావు లు పాల్గొని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎనిమిదవ వార్డులో నాలుగు రోజులు పాటు నిర్వహిస్తున్నటువంటి కంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి ఒక్కరు తమ కళ్ళను చూయించుకోవాలన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రెండో వార్డ్ కౌన్సిలర్ జక్కుల శంబయ్య, 6 వార్డు కౌన్సిలర్ ములకలపల్లి రామ్ గోపి, 28వ వార్డు కౌన్సిలర్ అమరబోయిన గంగరాజు, మెడికల్ ఆఫీసర్ జై సుష్మ, కంటి డాక్టర్ మల్లికా, డి ఈ ఓ శివకృష్ణ, ఏఎన్ఎం హేమవతి, సి ఓ సాయి కృష్ణ, అంగన్వాడి టీచర్ శాంత, ఆర్ పి శ్రీదేవి, ఆశా వర్కర్స్ సావిత్రి, మాలతి, సీత, నాగేంద్ర, ఇందిరా, పాలడుగు రాజు, లక్ష్మీనరసు, బండి భాస్కర్, ఆసోదు శ్రీనివాస్, దగ్గుబాటి దీవెనకుమార్, బాపనపల్లి వేణు తదితరులు పాల్గొన్నారు.




