Wednesday, 4 November 2026

ఓటు బ్యాంకు రాజకీయాలతోనే పీవీపై చిన్నచూపు

భీమదేవరపల్లి : ఓటు బ్యాంకు రాజకీయ వల్లే భారత మాజీ ప్రధాని పీవీ. నర్సింహారావును సొంత పార్టీనేతలే చిన్న చూపు చూస్తున్నారని బీజేపీ రాష్ట్రం ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. భీమదేవరపల్లి మండలం ఎర్రబెల్లిలోని ఇనుపరాతి గుట్టలను శుక్రవారం బీజేపీ బృందం సందర్శించింది. అనంతరం కొత్తపల్లిలో విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మీస అర్జునరావుతో కలిసి గుజ్జుల మాట్లాడారు. పీవీ నర్సింహారావు పేరు మీదుగా జిల్లాలో స్మృతివనం ఏర్పాటు చేసి గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు. తెలంగాణలోనే స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఖనిజ సంపద తరలింపును అడ్డుకుంటామని చెప్పారు. వలసలకు డెడ్‌లైన్లు కాదని,  తెలంగాణ ఏర్పాటు కోసం విధించాలన్నారు. ఇక్కడ మండలం శాఖ అధ్యక్షుడు పోల్నేని సుధాకర్‌రావు, జిల్లా ప్రధానకార్యదర్శి కొత్త శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి బర్రె శ్యాంసుందర్‌రెడ్డి, మేక రాజు , రవీందర్‌, వృథ్వీరాజ్‌, కొమురయ్య, శివసాగర్‌, దుర్గాసింగ్‌ , భూపాల్‌రెడ్డి . నారాయణ , శ్యాం సందీప్‌, ఓదెలు , సుమన్‌, శ్రావణ్‌ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *