విశాఖ, జనంసాక్షి: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర నేడు విశాఖలో ముగియనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు సభలో పాల్గొనేందుకు భారీగా తెదేపా కార్యకర్తల కోసం విశాఖకు ప్రత్యేకంగా 11 రైళ్లు ఏర్పాటు చేసినట్లు తెదేపా నేతలు తెలిపారు. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, అనంతపురం, ఖమ్మం, హైదరాబాద్, వరంగల్, విజయవాడ నుంచి ఈ రైళ్లు విశాఖ నగరానికి చేరుకుంటాయి. బహిరంగ సభకు సుమారు 5 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.




