Monday, 2 November 2026

ఓటు వేసే వారికి మాత్రమే ప్రశ్నించే హక్కు కేటీఆర్‌

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్‌ దంపతులు ఓటుహక్కు వినియోగించుకు న్నారు. బంజారాహిల్స్‌లోని నందినగర్‌ జీహెచ్‌ఎంసీ కమిటీ హాల్‌లో ఓటు వేశారు. కుటుంబ సమేతంగా వచ్చిన కేటీఆర్‌ పోలింగ్‌బూత్‌ 8లో తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసే వారికి మాత్రమే ప్రశ్నించే హక్కు ఉంటుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దయచేసి అందరూ ఓటేయాలని కోరారు. ఆలోచించి ఓటు వేయాలని, ఓటువేసి హైదరాబాద్‌ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు.