Thursday, 5 November 2026

ఓటేసిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌, మార్చి 22 : ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది. పలువురు ప్రముఖులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. నల్గొండ, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటి వరకు 6.5శాతం పోలింగ్‌ నమోదైంది. ఇక అచ్చంపేటలో ఎమ్మెల్యే బాలరాజు, మాజీమంత్రి రాములు, వరంగల్‌లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌, పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఓటుహక్కు వినియోగించుకున్నారు. హన్మకొండలోని ఆర్ట్స్‌ కళాశాలలో ఎంపీ సీతారాంనాయక్‌, వడ్డేపల్లిలో ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *