Thursday, 5 November 2026

హత్యా.. ఆత్మహత్యా?

tbsf00bgపంజగుట్ట మృతురాలిని గుర్తించిన పోలీసులు
ఆమె నందిగామకు చెందిన   సీఏ విద్యార్థిని పూజిత
ఇంట్లో సూసైడ్‌ నోట్‌ లభ్యం..
స్నేహితుడు అక్షయ్‌ వద్ద మరో లేఖ
అతణ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
కుమార్తె మరణవార్త విని
కుప్పకూలిన తల్లిదండ్రులు
హైదరాబాద్‌ సిటీ, నందిగామ, మార్చి 21: రాజధాని నడిబొడ్డున.. హైదరాబాద్‌, పంజగుట్టలోని ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు క్వార్టర్లకు పక్కనే ఉన్న పార్కులో సజీవదహనమైన యువతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మృతురాలు ఆంధ్రప్రదేశ్‌ కృష్ణాజిల్లా నందిగామకు చెందిన వాసిరెడ్డి పూజితగా ప్రాథమికంగా గుర్తించారు. అయితే.. ఆమెది హత్యా? ఆత్మహత్యా? అనే సందేహాలకు ఇంకా సమాధానాలు దొరకలేదు. ఎందుకంటే.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా పూజిత రాసిన రెండు సూసైడ్‌ నోట్లు లభ్యమవగా.. ఘటనాస్థలి ఆధారాలు చూస్తే పరిస్థితి అలా కనిపించట్లేదు! ఇంకా, ఈ ఘటనకు సంబంధించి అనేక చిక్కుముళ్లను పోలీసులు విప్పాల్సి ఉంది. కాగా.. పూజిత స్వగ్రామం చందర్లపాడు మండలం కొడవటికల్లు. తండ్రి వాసిరెడ్డి శ్రీనివాసరావు వ్యవసాయం చేస్తున్నారు. తల్లి అన్నపూర్ణ నందిగామలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. పూజితకు రోహిత అనే అక్క ఉన్నది. పిల్లల విద్యాభ్యాసం నిమిత్తం శ్రీనివాసరావు కుటుంబాన్ని నందిగామకు మార్చారు. పూజిత విజయవాడలో సీఏ శిక్షణ పొందుతోంది. ఏడాది క్రితం ఆమె.. అమీర్‌పేటలో ఉంటున్న తన చిన్నాన్న వద్ద ఉంటూ సీఏ శిక్షణ తీసుకుంది. ఆ సమయంలోనే బీహార్‌ రాషా్ట్రనికి చెందిన అక్షయ్‌ అనే యువకుడితో పూజితకు పరిచయమైంది. అక్షయ్‌ బంజారాహిల్స్‌లోని ఓ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.
ఏం జరిగింది?
పూజిత నందిగామ నుంచి 18వ తేదీ ఉదయం బయలుదేరి విజయవాడ వెళ్లింది. అక్కడి నుంచి రైలులో సికింద్రాబాద్‌ చేరుకుని, స్టేషన్‌లో దిగగానే స్నేహితుడు అక్షయ్‌కు ఫోన్‌ చేసింది. ఇద్దరూ కలిసి నెక్లె్‌సరోడ్డులోని ఈట్‌సీ్ట్రట్‌ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ భోజనం చేసిన తర్వాత అక్షయ్‌కు పూజిత ఓ టీషర్ట్‌ను బహుమానంగా ఇచ్చింది. సాయంత్రం వరకూ షికార్లు చేసిన తర్వాత పూజితను అక్షయ్‌ రాత్రి పది గంటల సమయంలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఇలా ఇంటికి వెళ్లిపోయిన అక్షయ్‌.. అర్ధరాత్రి మూడు గంటల సమయంలో పూజిత తనకు ఇచ్చిన టీషర్ట్‌ను చూడగా అందులో ఆమె రాసిన ఆత్మహత్య లేఖ లభించిందని పేర్కొంటూ ఆ లేఖను నాంపల్లి పోలీసుల వద్దకు తీసుకెళ్లాడు. ఈ లేఖను స్వాధీనం చేసుకున్న పంజగుట్ట పోలీసులు అక్షయ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఇలా తెలిసింది..
పార్కులో యువతి సజీవ దహనం గురించి ప్రచార సాధనాల్లో ప్రసారమైన వార్తల్లో.. ఆమె చెప్పులు, చెవి దుద్దులు చూపించారు. వాటిని చూసిన పూజిత పక్కంటి వాళ్లు.. ఆ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పారు. అయితే.. 18వ తేదీ ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన పూజిత మర్నాడు ఉదయం వరకు తిరిగి రాకపోయే సరికి ఆమె తల్లిదండ్రులు అప్పటికే నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇల్లంతా గాలించగా తమకు లభించిన ఆత్మహత్య లేఖను పోలీసులకు అందజేశారు. ఈ లేఖను, పూజిత ఫొటోలను తీసుకుని ఆమె చిన్నాన్న శనివారం పోలీసుల వద్దకు వచ్చారు.
ఎన్నో అనుమానాలు
లేఖల ఆధారంగా పోలీసులు దీన్ని ఆత్మహత్యగానే భావిస్తున్నారు. అయుతే.. ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటే అది 18వ తేదీ అర్ధరాత్రి నుంచి 19వ తేదీ తెల్లవారుజాము మధ్యన జరిగి ఉండాలి. ఒంటిపై కిరోసిన్‌ గానీ, పెట్రోలు గానీ పోసుకుని నిప్పంటించుకుంటే మంటల బాధకు తాళలేక వారు అటూఇటూ పరుగులు తీస్తారు. పెద్దగా అరుస్తారు. కానీ, పూజిత అరుపులు ఎవరికీ వినిపించలేదు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరనుకున్నా.. ఆమె, బాధతో అటూఇటూ పరిగెత్తడం వల్ల దుస్తుల బూడిద చెల్లాచెదురుగా పడి ఉంటుంది. అటువంటి ఛాయలూ అక్కడ కనిపించడంలేదు. ఘటనా స్థలంలో కిరోసిన్‌/పెట్రోలు సీసా గానీ, డబ్బా గానీ కనిపించలేదు. మద్యం సీసా మాత్రమే ఉంది. అలాగే అక్షయ్‌ ఆమెను 18వ తేదీ రాత్రి పది గంటలకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో దింపిన తర్వాత.. పూజిత నేరుగా పంజగుట్టలోని పార్కుకే ఎందుకు వచ్చిందన్నది ప్రశ్నార్థకంగా మారింది. అక్షయ్‌ తీసుకున్న టీషర్ట్‌ను వెంటనే చూడక.. అర్ధరాత్రి మూడు గంటల సమయంలో ఎందుకు చూశాడనే విషయం అనుమానాలకు తావిస్తోంది. పోలీసుల అదుపులో ఉన్న అతడు.. ఉదయం వరకు ఒక వాదన చెప్పి, మధ్యాహ్నానికి మాట మార్చినట్టు తెలుస్తోంది. అతడిపైనా అనుమానాలు బలంగా ఉన్నాయి. మరోవైపు.. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు పూజిత శరీరంలో కాళ్లు, చేతులు కాలిపో లేదని గుర్తించారు. ఆమె కడుపులో సాంబారు అన్నం, రొట్టె ఉందని నిర్ధారించారు. ఆమె ప్రాణం ఉండగానే కాలిపోయిందని తేల్చారు. కాగా.. కుమార్తె మరణ వార్త వినగానే పూజిత తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *