హైదరాబాద్, మార్చి 10 : ఓట్ల కోసమే టీడీపీ డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ అసలుతో పాటు వడ్డీ మొత్తం మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఆడపడుచులంటే టీడీపీకి చులకనభావం ఉందని రోజా విమర్శించారు. అంగన్‌వాడీ సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నారన్నారు. డ్వాక్రా రుణాలపై చర్చించేందుకు ప్రభుత్వం భయపడుతోందని వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు.




