విశాఖ జిల్లా విశాఖ పట్టణంలో ఓ హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి, స్కీముల పేరిట లక్షలాదిరూపాయలను వసూలు చేశారు. డబ్బు వసూళ్లపై బాధితులు విశాఖ టూ టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదులు చేశారు. నిందితుడు హోంగార్డు వన్‌టౌన్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. గత 20 రోజులుగా హోంగార్డు విధులకు హాజరుకావటం లేదని పోలీసులు చెప్పారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.




