Tuesday, 3 November 2026

ఓయూలో ఘనంగా నిమజ్జన వేడుకలు

ఉస్మానియా యూనివర్సిటీ: బంజారాల పవిత్ర పండుగ తీజ్‌ వేడుకలు ఓయూలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఓయూ లేడీస్‌హాస్టల్‌ సమీపంలో తీజ్‌శిబిరాన్ని ఏర్పాటు చేసి అన్నదానకార్యక్రమం నిర్వహించారు. అనంతరం లేడీస్‌ హాస్టల్‌ నుంచి ఆర్ట్స్‌ కళాశాల వరకు మొలకెత్తిన మొక్కలు, వ్తినాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బంజారామహిళలు, అమ్మాయిలు సాంప్రదాయ నృత్యాలు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఢిల్లీలో రాష్ట్రప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రునాయక్‌ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ గిరిజనుల సాంప్రదాయాలు, సంస్కృతిని పరిరక్షించుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *