ఓపెన్ ఎస్ ఎస్ సి ఇంటర్ ప్రవేశాల గడువు పెంపు
గోపాల్ పేట్ జనం సాక్షి జనవరి (09): తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) సార్వత్రిక విద్య ద్వారా ఎస్ ఎస్ సి, ఇంటర్, లో ప్రవేశాలు పొందేందుకు ప్రత్యేక అడ్మిషన్లు ఈనెల తొమ్మిదో తేదీ నుండి 13వ తేదీ వరకు అడ్మిషన్లు తీసుకోవాలని అపరాధ రుసుముతో ఉంటుందని గోపాల్ పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమాకాంత్ ఓపెన్ స్కూల్ పాఠశాల ఇంచార్జ్ బోరోజ్ యాదగిరి లు తెలియజేశారు.ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ లో ఎంపీసీ, బైపిసి, సిఇసి, కోర్సులలో ప్రవేశాలు పొందేందుకు ఇది ఇది చివరి అవకాశం అని నేరుగా పాఠశాలలో గాని లేదా 9951260 435 గల నెంబర్ ను సంప్రదించగలరని వారు తెలిపారు




