Wednesday, 4 November 2026

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఆనాటి జ్ఞాపకాలు ఎప్పటికీ మధురస్మృతులే

జనంసాక్షి జనవరి 9 :
ప్రభుత్వ ఉన్నత పాఠశాల అమ్మనబోలు 2002-2003 సం.రంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం అమ్మనబోలు లోని సమ్మక్క సారక్క గార్డెన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులందరూ మాట్లాడుతూ ప్రభుత్వ ఉన్నత పాఠశాల గురించి ఎంతో గొప్పగా,వారి పూర్వ అనుభవాలను, జ్ఞాపకాలను, అలాగే పాఠశాలలో చదుకోవడంతో వారు ఎంత పేరు ప్రఖ్యాతులు గాంచారో గుర్తు చేసుకున్నారు. అనంతరం పాఠశాల ఉపాద్యాయులు వీరా రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణా రెడ్డి, యాదయ్య, వెంకట నారాయణ,బిక్షపతి,వెంకటరాజు, విఠల చారి,సోమయ్య,రాంరెడ్డి,సంధ్యారాణి,వెంకట కృష్ణ,వల్లభాయ్, శంకర్ రెడ్డి,సమత,హమీద్,బిక్షమాచారి లను సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాద్యాయులు మాట్లాడుతూ పాఠశాల క్రమశిక్షణ కు మారుపేరు కనుకనే పూర్వ విద్యార్థులందరూ నేడు ఉన్నత పదవుల్లో ఉన్నారని కొనియాడారు. అదే విధంగా విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసినందుకు అభినందిస్తూ వారు భవిష్యత్ లో మరెన్నో ఉన్నత స్థానాల్లో ఉండాలని వారు ఆశీర్వదించారు. ఆత్మీయ సమ్మేళనం లో మౌనిక భారత నాట్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.