Thursday, 5 November 2026

ఓపెన్ టూ అల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంబించిన – జడ్పీటిసీ మధుకర్, ఎస్ ఐ అరుణ్ కుమార్.

 

మర్పల్లి జనవరి 20 (జనం సాక్షి) విద్యార్థి దశ నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని క్రీడలు మనసిక ప్రశాంతతకు శారీరిక దృఢత్వానికి తోడ్పడతాయని,  క్రీడలు స్నేహ సంబంధాన్ని పెంపొందిస్తాయి అని, అందరు  ప్రశాంత వాతావరణంలో ఆడాలని ఎస్సై అరుణ్ కుమార్ అన్నారు. శుక్రవారం రోజు మర్పల్లి మండల కేంద్రంలో ఓపెన్ టు ఆల్ క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించారు. మండల కేంద్రంలో పిఎంఆర్ యువసేన  ఆధ్వర్యంలో పిఎంఆర్  ఓపెన్ టు ఆల్ క్రికెట్ టోర్నమెంటును నిర్వహించారు. శుక్రవారం రోజు  ఎస్సై అరుణ్ కుమార్, జడ్పిటిసి మధుకర్ లు క్రికెట్ టోర్నమెంట్ లో ప్రారంభించారు. ప్రారంభించి కొద్దిసేపు క్రీడాకారులను తో క్రికెట్ ఆడి అలరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్సై అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని గెలుపునకు దారులు వేసిన వాడే గొప్ప వారు ఆన్నారు. జెడ్పిటిసి మధుకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రీడాకారుల నైపుణ్యాని వెలికితీసేందుకు ఈ టోర్నమెంట్ నిర్వయించడం జరుగుతుంది అని మర్పల్లి జెడ్పిటిసి మధుకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సినియర్ నాయకుడు ప్రభాకర్ గుప్త, మర్కెట్ కమిటి చైర్మన్ శ్రీకాంత్ గౌడ్, వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి, కో అప్షన్ సొహైల్, స్థానిక ఎంపిటీసీ సంగీత వసంత్, పార్టీ ప్రదాన కార్యదర్శి రాచయ్య, డి .ఆశోక్,  గఫ్ఫార్, మార్కెట్ కమిటీ  డైరక్టర్ గౌస్, సర్పంచులు, ఎంపిటీసీలు  తదితరులు పాల్గొనరు.