పెనుబల్లి, జనవరి 20(జనం సాక్షి)
పెనుబల్లి మండలం లింగగూడెం దేవతల గుట్ట దురాక్రమణల పై తహసీల్దార్ ఆదేశాలు మేరకు రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించా రు, లింగగూడెం రెవిన్యూ లోని 302 సర్వే నెంబర్లో పోపూరి కన్ స్ట్రక్షన్ పేరిట రెండు హెక్టార్ల భూమిని లీజ్ కు పొంది టెంపరరీ మైనింగ్ అనుమతులతో క్వారీ నడుపు తున్నారు, తమకు కెటాయించిన భూమి తో పాటు అదనంగా భూమి ని ఆక్రమించి మట్టి ని వ్యర్ధాలను పోస్తున్నారనే ఆరోపణలపై ఈ నెల 12న దేవతల గుట్టలో సర్వే నిర్వహించాలని తహసీల్దార్ రమాదేవి ఆదేశిం చారు, మండల సర్వేయర్ ఈశ్వరి గుట్టలో సర్వే నిర్వహించి రిపోర్ట్ ను తహసీల్దార్ కు అందజేశారు. ఈ రిపోర్ట్ ఆదారంగా జిల్లా కలెక్టర్ కు మైనింగ్ అధికారులకు నివేదిక ఇస్తామని తహసీల్దార్ తెలిపారు. ఈ క్వారీ అనుమతులు పొందిన ఇద్దరు గిరిజనులు ఇంతవరకు తమ అనుమతి పత్రాలతో విచారణకు హాజరు కాలేదని తెలిపారు.




