Thursday, 5 November 2026

ఓపెన్ టెన్త్,ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తు

కొత్తగూడ జులై 11 జనంసాక్షి:తెలంగాణ ఓపెన్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓపెన్ స్కూల్ పదవతరగతి,ఇంటర్ లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కొత్తగూడ స్టడీ సెంటర్ కో ఆర్డినేటర్,ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తోలెం దేవదాస్ ప్రకటన ద్వారా తెలియజేశారు.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ కారణాలతో మధ్యలో చదువు మానేసినవారు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ నెల 10వ తేదీ నుండి ఆగష్టు 10వ తేదీ వరకు అపరాధ రుసుం లేకుండా చెల్లించుకోగలరని అన్నారు.అలాగే ఆగష్టు 11వ తేదీ నుండి ఆగష్టు 31వ తేదీ వరకు అపరాధ రుసుంతో చెల్లించుకోగలరని పూర్తి వివరాలకు కొత్తగూడ ఆశ్రమ పాఠశాల (బాలురు) స్టడీ సెంటర్,8500038793,9490580404 ఈ నెంబర్లకు సంప్రదించాలని తెలిపారు.