జులై 15వ తేదీ వరకు ఓటర్ నమోదు పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

ధర్మపురి (జనం సాక్షి )జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తేది మంగళవారం ఉదయము అదనపు కలెక్టర్ బి ఎస్ లత అధ్యక్షతన నిర్వహించిన అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు పూర్తి నిండిన యువతీ యువకులు గ్రామీణ మరియు పట్టణ విద్యార్థులకు అవగాహన తెలియజేయాలని సూచించారు. 0.22-ధర్మపురి (ఎస్ సి) నియోజక వర్గము ధర్మపురి మండలము ప్రజా పరిషత్ కార్యాలయము నందు రాజకీయ ప్రతినిధుల సమావేశం బుత్ లెవల్ ఆధికారి, బూతు లెవల్ సూపర్ వైజర్ ట్రైనింగ్ నిర్వహించడం జరిగినది.సమావేశము లో ఫారం-6 ఫారం-7 ఫారం-8 & ఫారం-8A ప్రాసెస్సింగ్ గురించి నూతన ఓటర్ నమోదు గురించి & (PWD) వికలాంగుల ఓటర్ నమోదు గురించి అన్ లైన్ యందు ఉన్నటువంటి దరఖాస్తు లు ఈ నెల 15 వ తేది లోపు పూర్తి చేయమని ఆదేశాలు జారి చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి స్థానిక సంస్థలు రాజకీయ పార్టి ప్రజా ప్రతినిధులు,నియోజక వర్గ తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు