Tuesday, 3 November 2026

యాత్రికులకు ప్యాకేజీ ఆఫర్‌ రాడిసన్‌ బ్లూ

రాబోతున్న కుంభమేళా పురస్కరించు కుని రాడిసన్‌ బ్లూ హోటల్‌ యాత్రికుల కోసం ప్రత్యేకంగా ఓ ప్యాకేజీని ఆవిష్కరిం చింది. మండు, మహేశ్వర్‌, ఉజ్జయినీ, ఓంకారేశ్వర్‌ వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే పర్యాటకులను పూర్తిగా ఆనందపరిచే అంశాలెన్నో పొందుపరిచా మని విశాల్‌ జమౌర్‌, జనరల్‌ మేనేజర్‌, రాడిసన్‌ బ్లూ ఇండోర్‌ తెలిపారు. ఈ ప్యాకేజీలో ఓ కపుల్‌ మూడు రోజులు హోటల్‌లో నివాసంతో పాటుగా మండు, మహేశ్వర్‌, ఉజ్జయిని, ఓంకారేశ్వర్‌ సంద ర్శించటం, ఎయిర్‌పోర్ట్‌/రైల్వేస్టేషన్‌కి తీసు కుని వెళ్లి తీసుకురావటం, బఫే బ్రేక్‌ఫాస్ట్‌, డిన్నర్‌.. వంటి ఎన్నో సేవలని అందిస్తు న్నామన్నారు. ఈ ప్యాకేజీ ధర 26 వేల రూపాయలు(పన్నులు మినహాయించి)గా ఉందని ఆయన వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *