హైదరాబాద్,(జనంసాక్షి): ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. మృతుడు బండారు శ్రీనివాస్ అనే విద్యార్థి, గురూనానక్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాడు. మహబూబ్‌నగర్ జిల్లా అమన్‌గల్ మండలం గౌడిపల్లి గ్రామానికి చెందిన ఇతను క్యాంపస్‌లో ఉంటున్నాడు. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మృతుడు తన లేఖలో పేర్కొన్నాడు.




