హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఓయూ విద్యార్థులు ద్విచక్రవాహన ర్యాలీ చేపట్టారు. అయితే వీరి ర్యాలీని పోలీసులు ఎన్సీసీ గేటు వద్ద అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు విద్యార్థులు రాజ్‌భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఓయూలో భారీ బందోబస్తు చేపట్టారు.




