హైదరాబాద్: సమరదీక్షకు ర్యాలీగా బయలుదేరేందుకు అసెంబ్లీ చేరుకున్న తెరాస ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నేతలు దీక్షకు దిగారు. పార్టీ శాసనసభా పక్ష నే ఈటెల రాజేందర్, హరీష్‌రావు, జూపల్లి తదితరులు గాంధీ విగ్రహం ముందు బైఠాయించి తెలంగాణ వాదులపై ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ నినాదాలు చేశారు.




