22న ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశం
ఉస్మానియా యూనివర్సిటీ: ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థుల (అలూమ్ని) జనరల్ బాడీ సమావేశం ఈ నెల 22న నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాంచంద్రం తెలిపారు. కళాశాల ఆవరణలో ఈ సమావేశం జరుగుతుందని చెప్పారు. ఈ యేడాది సమావేశాన్ని చా లా భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దే శ వ్యాప్తంగా ఉన్న ఓయూ పూర్వ విద్యార్థులే కాకుండా విదేశాల నుంచి కూడా ఈ సమావేశానికి విద్యార్థులు హాజరు అవుతున్నట్లు చెప్పారు. ఓయూ ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం నిర్వహించి న కార్యక్రమంలో ఆయన అలూమ్ని వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1929లో ఈ కళాశాల మొదట ఆ రుగురు విద్యార్థులతో ప్రారంభమైందని తర్వాత దేశంలోనే ప్రతిష్టాత్మకమైన కళాశాలగా పేరు ప్రఖ్యాతులు గాంచిందని, ఎంతో మంది మేధావులను అందించిందన్నారు. ఇంజనీరింగ్ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులను ఒక వేదికపై తీసుకువచ్చేందుకు వెబ్‌సైట్‌ను రూపొందించినట్లు చెప్పారు. సమావేశంలో అలూమ్ని అసోసియేషన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కే.ఎం.సుబ్రమణ్యం, ఆఫీసర్ ఇన్‌చార్జి ప్రొఫెసర్ బి.రాజేంద్రనాయక్, ఓయూ అలూమ్ని అసోసియేషన్ స్పెషల్ ఆఫీస ర్ ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణ, అసోసియేషన్ ప్రతినిధులు ప్రమోద్ మహేంద్ర, నవీన్, డాక్టర్ రమణానాయక్ పాల్గొన్నారు.




