మిర్యాలగూడ, జనం సాక్షి.యూనివర్సిటీలలో ప్రముఖ యూనివర్సిటీగా పేరుగాంచిన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో గల ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఒక గిరిజన పుత్రుడు భౌతిక శాస్త్ర విభాగము అధిపతిగా హెచ్ఓడిగా ప్రొఫెసర్ ఎం శ్రీనివాస్ నియామకమయ్యారు. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం అప్పలమ్మ గూడెం గ్రామపంచాయతీ సూర్తయ తండాకు చెందిన మాజీ సర్పంచ్ మూడవత్ సూరయ్య తనయుడు ప్రొఫెసర్ ఎం శ్రీనివాస్ ఉస్మానియా యూనివర్సిటీ హెచ్ ఓ డి గా నియామకం కావడంతో పలువురు తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధాన యూనివర్సిటీల ఫిజిక్స్ విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ గా ప్రొఫెసర్ శ్రీనివాస్ పనిచేస్తున్నారు. గతంలో టీఎస్ సెట్ కోఆర్డినేటర్ గా పనిచేసిన అతను ప్రస్తుతం ఓయూ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ హెచ్ ఓ డి గా నియమితులైన సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి రవీందర్, రిజిస్టార్ ప్రొఫెసర్ పి లక్ష్మీనారాయణ ఓయు సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి వీరయ్య డీన్ ప్రొఫెసర్ ఏ బాలకిషన్, తోపాటు ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఆచార్యులు, రీసెర్చ్ స్కాలర్ పురుషోత్తం, తోపాటు రీసెర్చ్ స్కాలర్స్ విద్యార్థులు అభినందించారు. మారుమూల గిరిజన తండా నుండి చదువుతూ భౌతిక శాస్త్రీయ విభాగనికి డీన్ గా నియామకం కావడం అభినందనీయం అని లిటరరీ స్టడీ సర్కిల్ కన్వీనర్ ప్రభాకర్ కస్తూరి అభినందనలు శుభాకాంక్షలు విద్యార్థుల్లో శాస్త్రీ య దృక్పథాన్ని పెంపొందించడానికి శాస్త్రీయ విభాగాధిపతిగా కృషి చేయాలని తెలంగాణ మట్టి మనుషులు కన్వీనర్ పాండురంగారావు కోరారు.




