ఓసీపీ-3లో మజ్జిగ ప్యాకేట్ల పంపిణీ
యైటీంక్లయిన్ కాలని ఏఫ్రిల్ 01 (జనం సాక్షి) :
సింగరేణి ఆర్జీ -2 లోని ఓసీపీ-3 కృషి భవన్ లో శనివారం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రాజెక్టు అధికారి జీ. మోహన్ రెడ్డి హజరై ఉద్యోగులకు మజ్జిగ ప్యాకేట్ల ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ వేసవికాలంలో కూడా ఉద్యోగులకు మజ్జిగ ప్యాకేట్లు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొత్త సత్యనారాయణ రెడ్డి, ఫిట్ సెక్రటరీ కొంగర రవీందర్, కాలరీ మేనేజర్ రమేష్, వెల్ఫేర్ ఆఫీసర్ సురేందర్, మామిడి తిరుపతి, గట్టయ్య, మేకల శ్రీను, ఉస్మాన్, జగన్ బాబు, ఓదెల మల్లేష్, ఐలయ్య పాల్గొన్నారు.
ఓసీపీ-3లో మజ్జిగ ప్యాకేట్ల పంపిణీ




