సంస్థ మరింత అభివృద్ధి దిశలో పయనించేలా కృషి చేయాలి-ఆర్జీ-2 జీఎం ఐత మనోహర్
యైటీంక్లయిన్ కాలని ఏఫ్రిల్ 01 (జనం సాక్షి) : సింగరేణి సంస్థ మరింత అభివృద్ధి దిశలో పయనించేలా కృషి చేయాలనీ ఆర్జీ-2 జీఎం ఐత మనోహర్ ఉద్యోగుల కోరారు. శనివారం ఆర్జీ-2 జిఎం ఆఫీసు పైనాన్స్ విభాగంలో పూజా కార్యక్రమం 2023-24 నూతన ఆర్ధిక సంవత్సరం ప్రారంభం సందర్భంగా ఆర్జీ-2 జిఎం కార్యాలయంలోని ఫైనాన్స్అండ్ అకౌంట్స్ విభాగంలో నగదు లాకర్లకు జీఎం లక్ష్మిపూజ కార్యక్రమము నిర్వహించారు. గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అధిక ఉత్పత్తిని సాధించి సంస్థ మరిన్ని లాభాలను ఆర్జించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటుజిఎం అబ్దుల్ సలీం, డిజియం పర్సనల్ జి.రాజేంద్ర ప్రసాద్, డిజిఎం సివిల్ ధనుంజయ, డిజిఎం ఐఇడీ మురళీకృష్ణ, సీనియర్ సెక్యూరిటీ అధికారి పివి.రమణ, క్వాలిటి మేనేజర్ వెంకటమోహన్, ఎస్ఇ పర్చేజ్ చంద్ర రాజు, ఎస్టేట్స్ అధికారి జే.సునీతా, డివై ఫైనాన్స్ మేనేజర్ తిరుపతి రెడ్డి, ఫైనాన్స్ విభాగం అధికారులు సరిత, ప్రశాంత్, నితిన్, పిట్ సెక్రెటరి చిప్ప సత్యనారాయణ, ఎకౌంట్స్ విభాగం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
సంస్థ మరింత అభివృద్ధి దిశలో పయనించేలా కృషి చేయాలి




