Tuesday, 3 November 2026

ఓ బీజేపీ.. గోవులు సరే.. అమ్మాయిల సంగతేంటి

మోడీ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు రాజ్యసభ సమాజ్ వాదీ ఎంపీ జయా బచ్చన్. బీజేపీ ప్రభుత్వం గో రక్షణలో బీజీగా ఉంది.. కానీ మహిళల రక్షణలో మాత్రం కాదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తలనరికితే 11 లక్షలు ఇస్తా అన్న.. బీజేపీ నేత వ్యాఖ్యలపై మాట్లాడుతూ… ఈ విధంగా స్పందించారు జయ. గోవులను కాపాడుతున్నారు కానీ… దాడులకు గురవుతున్న మహిళలను కాదన్నారు. మహిళా రక్షణపై వేగవంతమైన చర్యలు తీసుకోవాలని బీజేపీకి సూచించారు.  గోవుల పేరుతో హింస సృష్టిన్నారని అడ్డుకోవాలన్నారు జయ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *