…
భైంసా రూరల్ జనవరి 20 జనం సాక్షి
బైంసా పట్టణంలోని జూనియర్ కాలేజ్,గణేష్ నగర్ లలో గల కంటి వెలుగు కేంద్రాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారుఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బర్కాడే పరిశీలించారు. కంటి వెలుగు కేంద్రాలకు వచ్చిన ప్రజలతో మాట్లాడారు.కంటి సమస్యలు పై ఆరా తీశారు.శిబిరాలలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కళ్ళద్దాలు ఉచితంగా అందజేయడం జరుగుతుందని తెలిపారు.నిర్వహణ ఎలా జరుగుతుందని సంబంధిత అధికారులను అడిగి… తగిలిన సూచనలు సలహాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బైంసా డివిజన్ ఆర్టీవో రవి కుమార్,బై0సా మండల తహసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, సీఐ ప్రవీణ్ కుమార్ సంబంధిత అధికారులు,తదితరులు ఉన్నారు.




