Thursday, 5 November 2026

కంటివెలుగు పథకం దేశనికే ఆదర్శం

 హుజూర్ నగర్ మార్చి 14 (జనంసాక్షి): కంటివెలుగు పథకం దేశానికే ఆదర్శం అని హుజూర్ నగర్ ఎంపిపి గూడెపు శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కరక్కయలగూడెంలో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాన్ని సర్పంచ్ కీత జయమ్మధనమూర్తితో కలిసి అయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. శస్ర చికిత్స అవసరం అయిన వారిని వెంటనే రిఫర్ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి మచ్చా వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ చింతకుంట్ల కల్పన, కీత అప్పారావు, కృష్ణ మోహన్, రామయ్య, కార్యదర్శి సతీష్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.