Thursday, 5 November 2026

కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి.

సర్పంచ్ లతా సంపత్…
శంకరపట్నం: జనం సాక్షి మార్చి 14
తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కంటి వెలుగు వైద్య శిబిరంలో ప్రతి ఒక్కరు కంటి వైద్య పరీక్షలు నిర్వహించుకుని సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ గుర్రం లతా సంపత్ గ్రామస్తులను కోరారు. మంగళవారం మండలంలోని వంకాయ గూడెం గ్రామంలో ఉచిత కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ లతా సంపత్ మాట్లాడారు తెలంగాణను అందరహిత తెలంగాణగా తీర్చిదిద్దే బాధ్యత గా ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారని, గ్రామస్తులు కంటి వెలుగు వైద్య శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకొని అందరహిత గ్రామంగా తీర్చిదిద్దాలని సర్పంచ్ కోరారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు వైద్య సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.