Wednesday, 4 November 2026

కంటి పరీక్షలు చేయించుకున్న డి ఎ ఓ

మిర్యాలగూడ, జనం సాక్షి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం విజయవంతంగా నడుస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం మిర్యాలగూడ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గల రైతు వేదికలో చేపట్టిన కంటి వెలుగు పరీక్షా శిబిరాన్ని మిర్యాలగూడ ఆర్డీవో కార్యాలయ డీఏవో రాధ సందర్శించి కంటి పరీక్షలను చేయించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్ ,ఆర్ డి ఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ కల్పన తదితరులు కంటి పరీక్షలు చేయించుకున్నారు.